Tollywood: నువ్వే కావాలి అమ్మ పాట మోషన్ పోస్టర్ విడుదల
ఇటీవల నివ్రితి ప్రొడక్షన్‌లో సాయి మానస్, విష్ణుప్రియ కలసి చేసిన జరీ జరీ పాట ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. విష్ణుప్రియ తన డ్యాన్స్‌తోపాటు గ్లామర్‌ను కలబోసి కుర్రకారులో అగ్గిరాజేసింది. అయితే ఇప్పుడు అదే ప్రొడక్షన్ వాలెంటైన్ డే సందర్భంగా మరో పాటను విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. వాలెంటైన్ డే అనగానే ప్రేమికుల కోసం రూపొందించే ప్రేమ గీతం అనుకోకండోయ్.. తల్లిప్రేమను వివరించే కమ్మనైన అమ్మ పాట. ఈ పాటలో సాయి మానస్, ఆమని, లిఖిత్ ముఖ్యపాత్రలో రూపొందిస్తున్నారు. ఈ పాటకు రంజిత్ కుమార్ లిరిక్స్ అందిచగా సందీప్ సన్ను పాడటంతో పాటు స్క్రీన్‌ప్లే,దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా పాట మోషన్ పోస్టర్‌ను నివ్రితి వైబ్స్ విడుదల చేసింది. నువ్వే కావాలి అమ్మ అంటూ సాగే ఈ పాటకు య్యూట్యూబ్‌లో మంచి స్పందనే లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com