Tollywood: తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఫిలిం ఛాంబర్‌లో మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు.అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమినీ కిరణ్ నిలవగా దామోదర ప్రసాద్‌కు మద్దతుగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిలిచారు. మరోవైపు జెమినీ కిరణ్‌కు సి.కల్యాణ్ మద్దతు తెలిపారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవికి వైవీఎస్ చౌదరి, ప్రసన్నకుమార్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరీ పోస్టులు ఏకగ్రీవమైనట్లు ఫిలిం ఛాంబర్ వర్గాలు తెలిపాయి. తెలుగు నిర్మాతల మండలిలో మొత్తం 1200 మంది సభ్యులు ఉన్నారు.
మరోవైపు తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలపై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు స్పందించారు. తెలుగు నిర్మాతల మధ్య పోటీ ఉండకూడదని, మంచి సినిమాల నిర్మాణంపైనే దృష్టి పెట్టాలన్నారు. పోటీ పడి నలుగురిలో చులకన కావద్దొని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com