Tollywood: "మెకానిక్" మోషన్ పోస్టర్ రిలీజ్

మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో, హీరోయిన్‌గా టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ - నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం "మెకానిక్". ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మంగళవారం విడుదల చేసి ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com