Tollywood: 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు'

యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. అయితే ఈ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమైతోంది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత 46 సంవత్సరాలుగా నటుడిగా ఆయనను ఆదరిస్తున్న ప్రేక్షకులు ధన్యవాదాలు తెలిపారు. నేను ఇంతకాలం కొనసాగటానికి నేను నమ్ముకున్న కామెడీనే. ఇటీవలే వాల్తేర్ వీరయ్య వంటి హిట్ ఇచ్చారు. మాయలోడు, రాజేంద్రుడు`గజేంద్రుడుతో నా కామెడీకి బ్రాండ్‌ను క్రియేట్ కావడంలో ముఖ్యపాత్ర వహించిన వారిలో ముఖ్యులు ఎస్.వి. కృష్ణారెడ్డి అని అన్నారు. ఈ సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండని అన్నారు. వినోదం తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ 'ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు'. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు, మంచి డైలాగ్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలనూ పుష్కలంగా ఏర్చి కూర్చిన సినిమా అని కృష్ణారెడ్డి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com