Tollywood :"దోచేవారెవరురా" ట్రైలర్ విడుదల

Tollywood :దోచేవారెవరురా ట్రైలర్ విడుదల
మార్చి11. న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ, ఎంటర్‌టైనర్ "దోచేవారెవరురా.."

IQ క్రియేషన్స్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం "దోచేవారెవరురా" ఈ సినిమా ద్వారా ప్రణవచంద్ర, ప్రణతి నూతనంగా వెండితెరపై పరిచయమౌతున్నారు. మాళవిక సతీషన్, అజయ్ గోష్, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్, అనిల్ రావి పూడి, విజయేంద్ర ప్రసాద్ లు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్ లు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి . ఆయన ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు. మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

శివ నాగేశ్వరావు మాట్లాడుతూ.. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగిందన్నాడు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని వెల్లడించాడు. నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ.. శివ నాగేశ్వరరావు సినిమాలలో ఉన్న కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.ఇప్పుడు మంచి కాన్సెప్ట్ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "దోచేవారెవరురా" సినిమాలో కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నానని, మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. శివ నాగేశ్వరావు దగ్గర నేను అక్షరాలు నేర్చుకొన్నాను. తన దగ్గర చాలా నేర్చుకొన్నాను ఆర్.జీ.వి శివ సినిమా తీసి ట్రెండ్ సెట్ చేసిన టైంలో శివ నాగేశ్వరావు గారు కిడ్నాపింగ్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ సెంటిమెంట్ తో "మనీ" లాంటి సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇలా తను ఎన్నో సినిమాలు నిర్మించిన శివ నాగేశ్వరావు ఇప్పుడు తీస్తున్న "దోచేవరెవరురా" సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో ప్రణవ్ చంద్ర మాట్లాడుతూ.. చడైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న నన్ను హీరోగా పరిచయం చేసిన శివనాగేశ్వరావుకి ధన్యవాదాలు. అయన దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు త్యాంక్స్‌ అని చెప్పారు. ప్రణతి మాట్లాడుతూ.. షార్ట్ రీల్స్ నుండి సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలని, అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story