Tollywood : 'మంగళవారం' సినిమాతో అజయ్ భూపతి

RX 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి తాజాగా 'మంగళవారం' సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను, కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాన్ సౌత్ ఇండియా ఫిలింగా విడుదలవుతున్నట్లు తెలిపారు. కాన్సెప్ట్ పోస్టర్ చూపరులను ఆకట్టుకుంటుంది. సీతాకోకచిలుక మాదిరిగా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఓ మహిళ నిలబడి ఉండగా సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా చుట్టూ డిజైన్ చేయబడి ఆ రెక్కల్లోని కళ్లు ఆ యువతినే చూస్తూ ఉన్నట్లుగా డిజైన్ చేశారు.
మూవీలో ఎవరు నటిస్తున్నారన్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. పోస్టర్ ను కనుక గమనిస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 తర్వాత తీసిన మహా సముద్రం సినిమా అంతగా ఆడకపోయేసరికి అజయ్ భూపతి కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. మంగళవారం సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు కాంతారా ఫేం అజ్నీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పథాకం పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com