Tollywood : విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు 'దమ్కీ'

Tollywood : విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు దమ్కీ
X
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ను బట్టి 'దమ్కీ' సినిమా మార్చ్ 22న విడుదల కానున్నట్లు సమాచారం

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దమ్కీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 17రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ప్రస్తుతం 'దమ్కీ' సినిమా థియోట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు చిత్ర యునిట్ తెలిపింది. ఓవర్సీస్ థియెట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్టిబ్యూటర్ రాధా క్రిష్ణ ఎంటర్టైన్మెంట్ కొనుగోలు చేసింది.

ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ను బట్టి 'దమ్కీ' సినిమా మార్చ్ 22న విడుదల కానున్నట్లు సమాచారం. తన ప్రతీ సినిమాను దగ్గరుండిమరీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు విశ్వక్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ టాలీవుడ్ లో ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. దమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చి 18న జరుపనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలువనున్నట్లు సమాచారం. ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Tags

Next Story