Tollywood: సమంత చేతులకు గాయాలు

Tollywood: సమంత చేతులకు గాయాలు
ఇన్‌ స్టాగ్రామ్‌లో రక్తం కారుతున్న ఫోటోలను షేర్ చేసిన సామ్‌

ప్రముఖ హీరోయిన్‌ సమంత చేతికి గాయాలయ్యాయి. ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ చేస్తుండగా సమంత రెండు చేతులకు గాయాలయ్యాయి. రక్తం కారుతున్న ఫోటోలను ఆమె ఇన్‌ స్టాలో స్టోరీగా పెట్టుకున్నారు. దక్షిణాదిన అగ్రకథా నాయికల్లో ఒకరిగా పేరు పొందిన సమంత..ఏడాదిన్నరగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మయోసైటిస్ వ్యాధి నుంచి ఇటీవలే కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

గూఢచర్యం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌లో సమంత పూర్తిగా యాక్షన్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆమె ఒక స్పైగా నటిస్తున్నారని సమాచారం. దీని కోసం ఇప్పటికే ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తాజాగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story