Tollywood: వరుణ్ తేజ్ స్టన్నింగ్ లుక్స్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మిగతా మెగా హీరోలతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ వైపు మొగ్గు చూపుతాడని చెప్పవచ్చు. అందుకు కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది తన స్టోరీ సెలక్షన్ ఏవిధంగా ఉంటుందో. అయితే వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో గాండీవధార అర్జున అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పనులు దాదాపు పూర్తవ్వగా త్వరలోనే విడుదల కాబోతోంది. తాజాగా వరుణ్ వీటీ13 సినిమాకు సిద్ధమైతున్నాడు. ఈ క్రమంలోనే ముంబయిలో న్యూలుక్‌తో అభిమానుల కంట పడ్డాడు. ఆలీం హాకీం స్టూడియోలో కనిపించిన వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త స్టైల్, స్టన్నింగ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. తన హెయిర్‌స్టైల్ మార్చి హాలీవుడ్ నటుల్ని తలపించే విధంగా ఉన్నాడు. ఈ ఫొటోలు కాస్త నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com