Tollywood: ఫిబ్రవరి 17న ధనుష్‌ "సార్‌"

మహాశివరాత్రి సందర్భంగా ప్రేకుల ముందుకు రానున్న "సార్"

తమిళ్‌ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆధరనే ఉంది. రఘువరన్‌ బీటెక్‌, మారి, తిరు వంటి హిట్‌ సినిమాలతో తెలుగులో క్రేజ్‌ బాగానే సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో కలిసి "సార్‌" అనే చిత్రంతో మరో హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్‌ నటిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పనులు దాదాపు ముగించుకుంది. కాగా ఎప్పటికప్పుడూ ఈ చిత్రబృందం సినిమా అప్‌డేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇటీవలే టీజర్‌, ట్రైలర్‌తో పాటు మేకర్స్‌ విడుదల చేసిన పాటలతో ఎక్కడలేని అంచనాలు పెంచేస్తోంది. అయితే ఈ సినిమాకు జీవి ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. అతని నేపథ్య సంగీతం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

తాజాగా విడుదలైన వన్‌లైఫ్‌ అనే తెలుగు ర్యాప్‌ సాంగ్‌ యువతను ఉర్రూతలూగిస్తోంది.ఈ పాటకు ప్రముఖ తెలుగు ర్యాప్‌ సింగర్‌ ప్రణవ్‌ చాగంటి లిరిక్స్‌ అందించడంతో పాటు హేమచంద్రతో కలిసి గాత్రం కూడా అందించాడు. య్యూట్యూబ్‌లో ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఎప్పటికైనా తెలుగు ర్యాప్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు పోవాలని ప్రణవ్‌ పట్టువీడని దీక్షచేస్తున్నాడనే చెప్పాలి. ఐతే ఈ సినిమాలో ఇప్పటికే రిలీజ్‌ అయిన మాస్టారు.. మాస్టారు పాట, బంజార పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయనే చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags

Next Story