Tollywood: ఝాన్సీ పార్ట్ 2 వచ్చేస్తోంది....

టాలీవుడ్ ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ'.సైకలాజికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు తిరు డైరెక్ట్ చేయగా, ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. తాజాగా సిరీస్ సెకండ్ సీజన్ కూడా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ నెల 27 నుంచి డిస్నీ హాట్ స్టార్ ఝాన్సీ పార్ట్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతుండగా తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మనిషి జీవితంలో పెద్ద శిక్ష తనెవరో తనకు తెలియకపోవడం అంటూ మొదలైన ట్రైలర్, పలు సైకలాజికల్, యాక్షన్ షాట్స్ తో కొనసాగుతుంది. ఇక యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలీ చేసిన స్టంట్స్ మామూలుగా లేవని ఆడియన్స్ చెబుతున్నారు.
ఇక ఈ సిరీస్ లో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఫస్ట్ సిరీస్ తో ఆకట్టుకున్న అంజలీ, సీజన్ 2తో ఎలా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com