Tollywood : ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న బెదురులంక 2012

Tollywood : ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న బెదురులంక 2012
కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తికేయ

Tollywood : యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ రొటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ లకు పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా అబ్బాయి మరో డిఫరెంట్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. బెదురులంక 2012 అంటూ జనాల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్న కార్తికేయ ఈసారి బాక్సాఫీస్ ను గట్టిగానే షేక్ చేసేట్లు ఉన్నాడు.


డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా కనిపించబోతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో మస్త్ హడావిడి చేస్తోంది. ఇప్పటికే మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ షోషల్ మీడియాను షేక్ చేసేస్తోందట.


విడుదలైన కాసేపటికే గ్లింప్స్ కు 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండబోతోందంటూ చిత్ర బృందం తెగ ఊరించేస్తోంది.


పల్లెటూరిలో యుగాంతం నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కామెడీ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. వచ్చే ఏడాదిలో మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి బెదురులంక 2012 తో హీరో కార్తికేయ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story