Tollywood: ఏప్రిల్ 21న 'హలో మీరా'

Tollywood: ఏప్రిల్ 21న హలో మీరా
X

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా 'హలో మీరా'. తెలుగు సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఒక్క పాత్రతో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీనివాసు కాకర్ల. ప్రముఖ దర్శకుడు బాపుతో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమాకు డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించారు.

ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు, ఎన్నో విభిన్న కారెక్టర్లుంటాయి. అలా ఉంటేనే సినిమా పండుతుందని, రెండున్నర గంటలు ప్రేక్షకులను అలరించ వచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయొచ్చని ఇది వరకు చాలా మంది దర్శకులు నిరూపించారు. అయితే ఇప్పుడు తెలుగులో నెక్స్ట్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేయడానికి గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో 'హలో మీరా' అనే సినిమా ఒకే ఒక పాత్రతో ఎంతో సాహసోపేతంగా తెరకెక్కించారు కొత్త దర్శకుడు శ్రీనివాసు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం, ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. హలో మీరా సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతోన్నట్టుగా నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు ఎస్ చిన్న సంగీతం అందించగా హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు.

Tags

Next Story