Tollywood: మార్చ్ 3న 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు'

యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు'. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాశాడు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సినిమా బృందం నిర్వహించింది.
ట్రైలర్ పై ప్రేక్షకుల స్పందన చూసి సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగిందన్నాడు చిత్ర దర్శకుడు. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ప్రతి క్యారెక్టర్ రాసుకోవడం జరిగిందన్నారు. తెరమీద పాత్రలు మిమ్మల్ని నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని నేను మార్చి 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. అందరం చాలా ఉత్సాహంగా, ఆతృతగా మార్చి 3వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ సినిమా అద్భుతంగా రావటానికి ఏం చేయాలో అది ఎవరి పరిధిలో వారు ది బెస్ట్ అన్నట్టుగా చేశారని ఆయన తెలిపాడు. అలాగే సోహెల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చాలాసార్లు చెప్పానన్నాడు.
అందరూ సక్సెస్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయిందంటారు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌కు వచ్చి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన మా 'ఆర్గానిక్ మామ ` హైబ్రీడ్ అల్లుడు' చూసి, మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నామన్నాడు. అయితే ఈ సినిమాలో సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com