Tollywood: ఫిబ్రవరి 3న "మైఖేల్" .. 8ప్యాక్ బాడీతో సందీప్
అంచనాలు పెంచుతున్న సందీప్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. నటుడిగా మంచి అభినయం ఉన్నప్పటికీ తన సినిమాలు ఏవీ చెప్పుకోతగ్గ కమర్షియల్ హిట్ అవ్వలేదు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.
తాజాగా రాబోతున్న "మైఖేల్" అనే చిత్రంలో తన కసినంతా చూపించేలా అతని లుక్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సందీప్ కండలు తెగ పెంచేశాడు. 8ప్యాక్ బాడీతో యువతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఇందులో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ మెరవనుంది.
రంజిత్ జయంకోడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరీ 3న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్ పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రామ్ మోహన్ రావు, భరత్ చౌదరి కలిసి నిర్మించారు. లవ్, యాక్షన్ కలగలిసిన ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ చూసిన వాళ్లాంతా ఈ సారి సందీప్ ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు.