Tollywood : మీసాల నుంచి పుట్టిన 'కొరమీను' కథ

మీసాల నుంచి పుట్టిన 'కొరమీను' కథ
సాధారణంగా థ్రిల్లర్, హారర్, కామెడీ వంటి జోనర్స్‌లో సినిమాలను రూపొందిస్తుంటారు. అయితే వాటన్నింటికీ భిన్నంగా సరికొత్త జోనర్ లో 'కొరమీను' తెరకెక్కించామంటున్నారు హీరో ఆనంద్ రవి. ఆయన కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సమాన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనే కాప్షన్ తో ఈ మూవీని సరికొత్తగా డైరెక్ట్ చేశారు శ్రీపతి కర్రి.
ఇక కథ విషయానికి వస్తే జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు. అతని మీసాలు ఎవరు తీసేశారనే కోణంలో ఈ స్టోరీ ఉండబోతుందట. ఓ పేదవాడికి, డబ్బున్నవాడికి మధ్య జరిగే గొడవే మూలకథ అని అర్థమవుతోంది. ఇక డిసెంబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'కొరమీను' మూవీ సరికొత్త ఒరవడిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. పరిమితమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాలకు సంబంధిచి లక్కీ లక్ష్మణ్ టీమ్ ఓ కొత్తదనాన్ని ఆపాదించారు. కొరమీను టీమ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. ఎందుకంటే డిసెంబర్ 31న కొరమీను సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే సరికొత్త ట్రెండ్‌కి, ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం పలికాయి.
ఏదేమైనా చిన్నమూవీస్-పెద్ద మూవీస్ అనే భేదం లేకుండా దీన్ని ఇలాగే అందరూ కొనసాగిస్తే బావుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్న ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని కూడా అందుకుంటాయేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com