Tollywood: వార్తల్లోనే కాదు సినిమాల్లోనూ దున్నేస్తా...

మీడియా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న జర్నలిస్ట్ మూర్తి... సినిమాల్లోనూ తన మార్క్ వేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య ప్లే బ్యాక్ మూవీలో విలన్ రోల్ చేసి అలరించిన మూర్తి ఇప్పుడు లిరిక్ రైటర్ గానూ మారారు. ఉమాపతి అనే సినిమాకు స్వయంగా తానే ఓ పాట రాసి అందిచారు.
అవికా గోర్, అనురాగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని బుట్ట అనే పాటకు సాహిత్యాన్ని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. రవికుమార్ మంద, జయశ్రీ పల్లెం గాత్రం అందించగా శశికాంత్ కార్తిక్ స్వరాలు అందించారు. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, భద్రం, ఆటో రామ్ ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు.
సత్యా ద్వారపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెన కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్ గౌతమ్ రాజు పనిచేసిన ఆఖరి చిత్రాల్లో ఉమాపతి కూడా ఒకటి కావడం విశేషం. ఏమైనా ప్రస్తుతం బుట్టా పాట సాహితీ ప్రియులను ఆకట్టుకుంటోంది. పాట విన్నవారు మూర్తి న్యూస్ ఛానల్‌లోనే కాదు దేంట్లోనైనా దున్నేస్తారంటూ కితాబులు ఇచ్చేస్తున్నారు. ఇంతకు ఆ పాట ఎలా ఉందో ఆలస్యం చేయకుండా మీరు చూసేయండి మరీ..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com