Tollywood : 'రాజు యాదవ్' టీజర్ అదిరిపోయిందిగా....

Tollywood : రాజు యాదవ్ టీజర్ అదిరిపోయిందిగా....
హీరోగా ఎంట్రీ ఇస్తున్న గెటప్ శీను; కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం; ఆకట్టుకుంటోన్న టీజర్

జబర్దస్థ్ ఫేం గెటప్ శ్రీను హీరోగా తెకెక్కిన చిత్రం రాజు యాదవ్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేసేస్తోందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా.. నవ్వుతూ బతాకాలనుకుంటారు. కర్మగాలి జీవితంలో ఎప్పుడూ నవ్వుతూ బతకాల్సివస్తే...?" అంటూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మెదలైన టీజర్... తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఇక శ్రీను యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు.


సాయి వరుణ వి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. గెటప్ శ్రీనుకు జోడిగా అంకిత్ కరత్ కనిపించబోతోంది.

ఏం జరిగినా జీవితం మొత్తం నవ్వు ముఖంతోనే ఉంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన పాయింట్ ను టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందింది. క్రికెట్ ఆడుతున్న హీరో ముఖానికి దెబ్బతగిలి ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోతాయి. దీంతో హీరో మామూలుగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ముఖం మాత్రం నవ్వుతూ ఉన్నట్లుగానే కనపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కథానాయకుడు ఏం చేశాడు? తన సమస్యను ఎలా అధిగమించాడు అన్నదే కథ.


ఇక గెటప్ శ్రీను నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడనే చెప్పాలి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, ఆనంద్ చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, సన్నీ, సంతోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story