Tollywood: తెలుగు నటుడు సుధీర్ ఆత్మహత్య

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తెలుగు ఇండస్ట్రీ పాత తరం నటులు కైకాల, కృష్ణంరాజు, చలపతిరావు లాంటి వారు ఒకరి వెనక ఒకరు మరణించగా సోమవారం యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్టణంలోని అతని నివాసంలో ఆత్మహత్యచేసుకున్నాడు.
వ్యక్తిగత కారణాలవల్లే సుధీర్ సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. అతడి మరణవార్తను నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని, అతని మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతని మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన "కుందనపు బొమ్మ" లో సుధీర్ కథానాయకుడిగా నటించాడు. సెకండ్ హ్యాండ్, షూట్‌ఔట్ ఎట్ ఆలేరు సినిమాల్లో కూడా సుధీర్ నటించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com