11 Oct 2021 1:00 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Shivaji Raja Resign :...

Shivaji Raja Resign : 'మా' సభ్యత్వానికి శివాజీరాజా రాజీనామా...!

Shivaji Raja Resign : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది.

Shivaji Raja Resign : మా సభ్యత్వానికి శివాజీరాజా రాజీనామా...!
X

Shivaji Raja Resign : నిన్న(ఆదివారం అక్టోబర్ 10 ) జరిగిన మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ఎక్కువ మెజారిటీని సొంతం చేసుకుంది. ఆ ప్యానల్ నుంచి ఎక్కువ మంది గెలిచారు. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత మా కి రాజీనామాల పర్వం మొదలైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా.. నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. తాజాగా శివాజీ రాజా కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు మా ఎన్నికల పైన మాట్లాడిన ఆయన నటుడు నరేష్ పైన సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. నరేష్ కారణంగానే 'మా' ఎన్నికల్లో ఇంత రచ్చ జరుగుతోందని.. అతని వల్లే ఇన్ని విభేదాలంటూ కామెంట్స్ చేశారు శివాజీరాజా.

Next Story