గ్రాండ్‌గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ నిశ్చితార్థం

హనీ ఇజ్ ద బెస్ట్ అంటూ.. యూత్‌కి బాగా కనెక్ట్ అయిన బ్యూటీ మెహ్రీన్. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. త్వరలో పెళ్లిపీటలెక్కనుంది.F2, కవచం, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్.. లాంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది. ప్రస్తుతం F2 సీక్వెల్.. F3లో నటిస్తోన్న ఈ హనీ బ్యూటీ.. మాజీ ముఖ్యమంత్రి మనువడికి రింగ్ పెట్టేసింది. మధ్యప్రదేశ్ జైపూర్‌లోని అలీలా కోటలో శుక్రవారం మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక జరిగింది.
హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కుమారుడైన భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా భవ్య బిష్ణోయ్‌తో కలిసి మెహ్రీన్ పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా త్వరలో జరగనునట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com