అందాల రాశి.. లంగా ఓణీలో మెరిసి.. ఫోటోలు వైరల్

మోడ్రన్ డ్రెస్‌లు ఎన్ని వేసినా తెలుగింటి ఆడపడుచులా లంగాఓణీలో మెరిసిన సౌందర్యం.. అందాల రాశి ఆహార్యం.. తన కట్టు బొట్టుతో, కవ్వించే కళ్లతో నెటిజన్లను కట్టిపడేస్తోంది.. అచ్చతెనుగు ఆడపడుచులా పదహారణాల అందంతో యువ హృదయాలను కొల్లగొడుతోంది. మద్రాస్ కేఫ్‌తో తెరంగేట్రం చేసిన ఢిల్లీ భామ రాశీఖన్నా.. ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న రాశి నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది.
తాజాగా రాశీఖన్నా ఫొటోషూట్‌లో పాల్గొన్నది. నుదుటన ఎర్రటి బొట్టు, కళ్లకు కాటుక, జడలో బంతిపూలు పెట్టుకుని లంగావోణిలో అలరిస్తోంది. ఎరుపు, ఆకుపచ్చ కలర్ కాంబినేషన్‌లో నవ్వుతూ, సిగ్గుపడుతూ విభిన్న హావభావాలు ప్రదర్శిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది రాశిఖన్నా. తనను కొత్త లుక్‌లో చూపించిన డిజైనర్ శ్రవణ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఫోటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది రాశీఖన్నా. ఈ ఏడాది విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్‌లో కనిపించిన రాశి.. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలకు సైన్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com