'చాలాకాలం నుంచి సీక్రెట్‌గా ఉంచా.. ఇప్పుడు చెబుతున్న'..: టాలీవుడ్ హీరోయిన్

చాలాకాలం నుంచి సీక్రెట్‌గా ఉంచా.. ఇప్పుడు చెబుతున్న..: టాలీవుడ్ హీరోయిన్
తాను త‌ల్లి కాబోతున్న‌.. విషయాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొంది టాలీవుడ్ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ.. తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. 'చాలా కాలం నుంచి ఓ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా.. కానీ ఈ రోజు మీ అందరితో ఈ శుభవార్తని పంచుకోవడం చెప్పలేని సంతోషంగా ఉందంటూ'.. తాను త‌ల్లి కాబోతున్న‌.. విషయాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొంది రిచా గంగోపాధ్యాయ.గత కొన్ని సంవత్సరాలుగా మూవీలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. అమెరికాకు వెళ్లింది. అక్కడ తన సహ విద్యార్ధి అయిన 'జోకు'తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతన్ని మ్యారేజ్ చేసుకుని.. వివాహా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తాను ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్టు ప్రకటించి.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.


'జూన్‌లో మా ఫ్యామిలీలోకి ఓ చిన్నారి అడుగుపెట్టనుంది. మా ఇంటికి రానున్న ఆ చిన్నారి కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాం అంటూ' రీచా ట్వీట్ చేసింది. త‌న భ‌ర్త‌తో క‌లిసి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

2010లో 'లీడర్' మూవీతో తెలుగు తెరకు పరిచయ అయ్యింది రిచా గంగోపాధ్యాయ. ఆ తరువాత మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు, నాగవళ్లి వంటి హిట్ మూవీల్లో నటించి.. యూత్‌ని నిద్రపట్టకుండ చేసింది. అటు తమిళంలోను కొన్ని సినిమాలు చేసిన రిచా గంగోపాధ్యాయ.. సడెన్‌గా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. సినిమాలు చేయకపోయినా.. సోషల్‌మీడియాలో ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
Tags

Read MoreRead Less
Next Story