నీకింకా బుద్ది రాలేదా సుమంత్.. ? వర్మ పంచ్..!

నీకింకా బుద్ది రాలేదా సుమంత్.. ? వర్మ పంచ్..!
X
టాలీవుడ్ హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది

టాలీవుడ్ హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపైన వివాదాస్పద దర్శకుడు రామ్‌‌గోపాల్‌‌వర్మ తనదైన స్టైల్‌‌లో పంచ్ వేశాడు. "ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్? ఒక పెళ్ళే అంటేనే నూరేళ్ళ పెంట.. అయితే రెండో పెళ్ళేంటయ్యా స్వామి? నా మాట విని మానేయ్. పవిత్ర గారు ( సుమంత్‌‌కి కాబోయే భార్య) మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది.. సుమంత్‌‌ది కాదు. నీ కర్మ , ఆ పవిత్ర కర్మ అనుభవించండి. అని ట్వీట్లు చేశాడు. కాగా గతంలో సుమంత్.. హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకాగా, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.


Tags

Next Story