టాలీవుడ్ దర్శకుడుకి టోపీ వేసిన సైబర్ కేటుగాళ్లు!

టాలీవుడ్ దర్శకుడుకి టోపీ వేసిన సైబర్ కేటుగాళ్లు!
Tollywood Director Venky Kudumula
అతని మాటలు నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి రూ. 66వేలు డిపాజిటి్‌ చేశాడు.

భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్‌ కేటుగాళ్లు టోపీ వేశారు. అది కూడా ఆయన డైరెక్ట్‌ చేసిన చిత్రం 'భీష్మ' పేరు చెప్పి. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు 'భీష్మ' సినిమాను నామినేట్‌ చేస్తామంటూ చెప్పి రూ.66 వేలు డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశారు. ఓ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానల్‌ సభ్యుడినంటూ రీసెంట్‌గా డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భీష్మ' చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్‌ చేస్తామని నమ్మించాడు. ఒక్కొక్క కేటగిరీకి పదకొండు వేల రూపాయలు చొప్పున చెల్లించాలన్నాడు. అతని మాటలు నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి రూ. 66వేలు డిపాజిటి్‌ చేశాడు.

అయితే మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్‌ చేసి ఆరు కేటగిరిలలో మూడింట నామినేషన్స్‌లో తప్పు జరిగిందని, మరో 66వేలు డిపాజిట్‌ చేయాలన్నాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ కుడుముల నామినేషన్‌ అవసరం లేదన్నాడు. తర్వాత విషయాన్ని ఆరా తీయగా, తనకు వచ్చిన కాల్‌ ఫేక్‌ అని, జరిగిన మోసం తెలిసింది. దీంతో వెంకీ కుడుముల సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్‌ నెంబర్, అకౌంట్‌ డీటయిల్స్‌ ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story