Rakul Preet Singh : రకుల్‌కు ఈడీ షాక్.. ఆ రోజున హాజరు కావాల్సిందే..!

Rakul Preet Singh  : రకుల్‌కు ఈడీ షాక్.. ఆ రోజున హాజరు కావాల్సిందే..!
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌లో ఉదయం 11 గంటల నుంచి విచారిస్తున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తూ.. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. సమాచారం.

అటు.. ఈ నెల 6న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. కొంత గడువు కావాలని కోరారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల.. తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారఐ సమాచారం. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కొన్నిరోజుల్లో జరగనున్న ఈడీ విచారణకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరు అవుతారా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

సుమారు నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలువుర్నిసుదీర్ఘంగా విచారించిన ఎక్సైజ్‌ అధికారులు... వాళ్లందరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. కానీ.. తాజాగా డ్రగ్స్‌ కేసును టేకప్‌ చేసిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్‌ చట్టం కింద 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆగస్టు 31న పూరీ జగన్నాథ్‌ను సుమారు 10 గంటల పాటు సుధీర్ఘంగా విచారించారు. సెప్టెంబర్‌ 2న ఛార్మి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇక.. 6న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్‌, 13న నవదీప్‌తోపాటు ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ ఖాన్‌, 17న తనీశ్‌, 20న నందు, 22వ తేదీన తరుణ్‌ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది.

కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Tags

Next Story