బ్రేకింగ్..సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 72 మంది పేర్లు

బ్రేకింగ్..సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 72 మంది పేర్లు
ఎక్సైజ్‌ శాఖ దాఖలు చేసిన 8 ఛార్జిషీట్లలోనూ సంచలన అంశాలు

హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో.. కీలక విషయాలు వెలుగులో వచ్చాయి. గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఎక్సైజ్‌ శాఖ. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌ దరఖాస్తు చేసిన ఆర్టీఐకి రిప్లై ఇచ్చింది ఎక్సైజ్‌ శాఖ. ఈ 12 కేసుల్లో కేవలం 8 కేసుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు వెల్లడించింది ఎక్సైజ్‌శాఖ. కానీ.. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వలేదు. ఇక ఎక్సైజ్‌ శాఖ దాఖలు చేసిన 8 ఛార్జిషీట్లలోనూ సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌ డ్రగ్‌ దందా... ఖండాంతరాలు దాటినట్లు...ఆర్టీఐ ద్వారా తెలుస్తోంది. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లండ్‌ ల నుంచి కొరియర్‌ ద్వారా...డ్రగ్స్‌ సప్లై జరిగినట్లు, విదేశాల నుంచి స్టీల్‌ బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్ఎస్‌డీ సరఫరా అయినట్లు వెల్లడైంది.

ఇక సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్‌ లభ్యమైనట్లు తెలుస్తోంది. 8 ఛార్జిషీట్లలో కాలేజీ విద్యార్ధులతో పాటు ప్రముఖల పేర్లు ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. ఇందులో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో 72 మంది పేర్లు ఉన్నాయి. విచారణకు హాజరైన12 మందితో మరో 60 మంది జాబితా ఉన్నట్లు తెలిపింది. అయితే సిట్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ను సైతం బయటపెట్టాలని ఎఫ్‌ఎఫ్‌జీ డిమాండ్‌ చేసింది.

Read MoreRead Less
Next Story