Allari Naresh Emotional : ఎనిమిదేళ్ల తర్వాత సక్సెస్.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్..!

Allari Naresh Emotional
Allari Naresh Emotional : కామెడీతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తూనే సీరియస్ పాత్రలతో మెప్పించగల నటుడు అల్లరి నరేష్. ప్రాణం, గమ్యం లాంటి విభిన్నమైన చిత్రాల తరవాత అల్లరి నరేష్ నటించిన చిత్రం నాంది.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు యూనిట్ సభ్యులు.
ఈ సందర్భంగా నటుడు అల్లరి నరేష్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా సోలో హీరోగా సక్సెస్ చూడని నరేష్.. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో తన తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకొని ఏడ్చేశారు. ఈ సక్సెస్ కోసం తానూ ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూశానని, సుడిగాడు సినిమా తరవాత తన కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం నాంది అని అన్నారు. సినిమా ఫస్ట్ షో అయ్యాక చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయని, అందరూ ఇలాంటి కొత్త తరహ సినిమాలు చేయాలనీ కోరినట్టుగా నరేష్ చెప్పుకొచ్చాడు.
కాగా, అల్లరి నరేష్ 57వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. ఇందులో నరేష్ కి జోడిగా నవామి గాయక్ నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
Also Read :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com