Krishnam Raju : పనిమనిషిని సన్మానించిన కృష్ణంరాజు కుటుంబం...!

Krishnam Raju : తమ ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది.. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కృష్ణంరాజు కుమార్తె ప్రసీద షేర్ చేస్తూ 25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారంటూ పోస్ట్ చేయగా అవి వైరల్ మారాయి. అంతేకాకుండా ఆమెకి కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు సమాచారం.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పనిమనిషికి ఇలా సత్కారం చేయడం గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
25 years of literally doing everything and anything and keeping us sane. Thank you for everything Padma Aunty💙#25years #pillarofstrength #gkmwomen pic.twitter.com/lqwlp5xsUa
— Praseedha Uppalapati (@PraseedhaU) October 21, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com