Balakrishna Unstoppable : తీయండి తెర.. కొట్టండి తొడ.. డిజిటల్ స్క్రీన్ పై బాలయ్య 'అన్ స్టాపబుల్' షో..!

Balakrishna Unstoppable : జై బాలయ్య. ఈ పేరులో ఏదో ఊపుందబ్బా! అందుకే ఈ మాట వింటే.. తెలుగు నేలతో పాటు అమెరికా గడ్డ కూడా ఊగిపోతుంది. అందరి గుండెలోతుల్లో ఏదో తెలియని పాట మొదలవుతుంది. అదిగో... అక్కడుంది బాలయ్య సీక్రెట్. ఒక్కసారి మాట్లాడితే నాన్ స్టాప్ డైలాగ్స్. ఒక్కసారి తొడగొడితే నెవర్ స్టాప్ ఫైటింగ్స్. రొమాన్స్ లో రాక్స్.. యాక్షన్ లో పీక్స్. ఎవ్వరైనా సరే.. బాలయ్య బాబు తరువాతే అనే హార్డ్ కోర్ ఫ్యాన్స్.. అలాంటివారిని కోట్లలో కలిగిన నందమూరి నటసింహం. ఇంతవరకు వెండితెరపై బాలయ్య బాబును ఒకవైపే చూశారు. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ పై ఫస్ట్ టైమ్.. ఆ సింహాన్ని రెండోవైపు చూడబోతున్నారు.. అది కూడా అన్ స్టాపబుల్' షో లో.
ప్రతీ మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీలో ఇది నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోతోంది. ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్యకు మాత్రమే సీనియర్ ఎన్టీఆర్ దగ్గర చనువు ఉండేది. నిజానికి అంత చనువు ఎవరికీ ఉండేది కాదు. అలాంటి వారి ఇంట పుట్టిన అల్లువారబ్బాయి.. అల్లు అరవింద్ అడిగిందే తడవుగా... వెంటనే ఈ షో చేయడానికి బాలయ్య ఒప్పుకున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు ఎంతోమంది ఈ అన్ స్టాపబుల్ షో కోసం పనిచేస్తున్నారు. అందుకే బాలయ్య కూడా ఈ షో పై చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఆయన వెండితెరపైనే నటుడు. నిజజీవితంలో కోపం వస్తే కోప్పడతారు.. సంతోషం వస్తే అంతే ప్రేమను చూపిస్తారు. అందుకే బాలయ్య అంటే అల్లు అరవింద్ తో పాటు అందరికీ అంత అభిమానం.
ఈ ప్రోగ్రామ్ లో సినీ నటులు వస్తారు. వాళ్లతో బాలయ్య కబుర్లు, వాళ్ల భావోద్వేగాలను స్క్రీన్ పై చూపించే ప్రయత్నాలు, మాటలతో ట్విస్ట్ లు, జోక్స్ చక్కిలిగింతలు.. అబ్బో! షో లో బాలయ్య అదిరిపోవాలంతే అని అభిమానులు చాలా గట్టిగానే కోరుకుంటున్నారు. సినిమాలు తప్ప మరో ప్రపంచం లేని బాలయ్య ఇంతవరకు కమర్షియల్ యాడ్స్ జోలికి కూడా పోలేదు. అందుకే ఫస్ట్ టైమ్ యువరత్న ఇందులో ఎలా మెరుస్తాడో, మురిపిస్తాడో, మైమరిపిస్తాడో చూడాలి.
Aha lo kaludhaam ani mana balayya garu annarante history repeat avvatam khayam!🔥#UnstoppableWithNBK#NBKonAHA. pic.twitter.com/8fqiqLnMYV
— ahavideoIN (@ahavideoIN) October 14, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com