తూచ్.. సోలో బ్రతుకు సో బెటర్ కాదు.. మేలో పెళ్లి..!

ఇండస్ట్రీలోని పెళ్లి కాని ప్రసాదులంతా లాక్డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. మెగా డాటర్ కూడా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పడు మెగా కుటుంబ సభ్యుడు సాయి ధరమ్ తేజ్ వంతు వచ్చింది. ఆయనకు కూడా పెళ్లిపైకి మనసు పోయింది. మేలో పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నేను సింగిల్. కానీ నా కుటుంబం నా పెళ్లి కోసం ప్లాన్ చేస్తోంది. నిహారిక పెళ్లి అయిన దగ్గరనుంచి నాపై ఒత్తిడి పెరిగింది అని అన్నాడు.
ఇప్పుడు ఈ వార్త నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్‌లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి టాపిక్ నడుస్తోంది. ఈ ఏడాది మే నెలలో ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని, కుటుంబసభ్యులు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని తెలుస్తోంది. ఆమెకు ఇండస్ట్రీతో సంబంధం లేదని, మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయని వినిపిస్తోంది.
మరి కొద్ది రోజులు ఓపిక పడితే సాయి ధరమ్‌ని చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుస్తుంది. అచ్చంగా మామ చిరంజీవిని గుర్తుకు తెచ్చే రూపం, స్టెల్, డ్యాన్స్ అతడికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. విభిన్న చిత్రాల్లోనటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు సాయి ధరమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com