ఈ 10 సినిమాలు చేసుంటే సుమంత్ స్టార్ హీరో అయ్యేవాడు..!

అక్కినేని మూడోతరం హీరోలలో మొదటివాడు సుమంత్.. 1999 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యాడు సుమంత్.. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీరావా చిత్రాలతో ఆకట్టుకున్న సుమంత్.. మంచి అభిరుచి కల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ 20 సంవత్సరాలలో చాలా తక్కువ సినిమాలే చేశాడు కానీ.. చేసిన సినిమాలలో మంచి కంటెంట్ బెసేడ్ మూవీస్ ఉన్నాయి. అయితే సుమంత్ చాలా వరకు హిట్స్ మూవీస్ ని రిజెక్ట్ చేశాడు. ఇందులో కొన్ని సుమంత్ రిజెక్ట్ చేయగా, మరికొన్ని మాత్రం అనుకోకుండా మిస్ అయ్యాయి. అవేంటో చూద్దాం..!
నువ్వేకావాలి :
ముందుగా ఈ సినిమాకి సుమంత్ నే హీరో అనుకున్నారు. కానీ సుమంత్ రిజెక్ట్ చేయడంతో తరుణ్ కి వెళ్ళింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే..!
తొలిప్రేమ :
ముందుగా కరుణాకరన్ ఈ కథకి సుమంత్ నే హీరోగా అనుకున్నారట.. కానీ అయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ పవన్ కళ్యాణ్ కి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని ఇచ్చిందో తెలిసిందే!
మనసంతా నువ్వే :
ఉదయకిరణ్ కి హ్యట్రిక్ హిట్ ఇచ్చిన సినిమా ఇది.. ఈ సినిమాని కూడా సుమంత్ రిజెక్ట్ చేశారట.. !
ఆనందం :
శ్రీనువైట్లకి మంచి హిట్ ఇచ్చిన చిత్రం ఆనందం.. ముందుగా ఇందులో ఆకాష్ పాత్రకి సుమంత్ నే అనుకున్నారట.. కానీ ఇది సుమంత్ రిజెక్ట్ చేశారట..!
గమ్యం :
సినిమాలోని శర్వానంద్ పాత్రకి సుమంత్ నే అనుకున్నారట దర్శకుడు క్రిష్.. కానీ సుమంత్ రిజెక్ట్ చేయడంతో శర్వానంద్ కి వెళ్ళింది.
దేశముదురు :
ఈ కథ నచ్చినప్పటికీ తనకి సూట్ అవ్వద్దని రిజేక్ట్ర్ చేశారట సుమంత్... ఈ సినిమాని బన్నీ చేశాడు కాబట్టి అంత పెద్ద హిట్టైందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుమంత్...
నువ్వు వస్తావని :
సుమంత్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున చేశారు. నాగార్జునకి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది.
ఇడియట్ :
పవన్ కళ్యాణ్, సుమంత్ రిజెక్ట్ చేయడంతో రవితేజ వద్దకి కథ వెళ్ళింది... ఈ సినిమా రవితేజని స్టార్ ని చేసింది.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరిస్ :
రవితేజ కెరీర్‌లో అద్భుతమైన సినిమాల్లో ఈ సినిమా ఒకటి.. ఈ కథకి కూడా ముందుగా సుమంత్ నే అనుకున్నారట..
అష్టా చమ్మా :
ఇందులోని నాని పాత్రకి ముందుగా సుమంత్ ని అనుకున్నారట దర్శకుడు ఇంద్రగంటి.. అయితే సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర నానికి వెళ్లి అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది.
సుమంత్ ఒకవేళ ఈ సినిమాలు చేసుంటే అతడు పెద్ద స్టార్ అయ్యేవాడని సినీ విశ్లేషకుల అభిప్రాయం.. కాగా సుమంత్.. ఈ సినిమాల దర్శకులతో వేరే కథలతో సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com