టాలీవుడ్

Dil Raju: తమ్ముడి కొడుకు కోసం 'దిల్ రాజు' చీప్ ట్రిక్స్ ..

రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న దిల్ రాజు నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు.

Dil Raju: తమ్ముడి కొడుకు కోసం దిల్ రాజు చీప్ ట్రిక్స్ ..
X

Dil Raju: కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వాళ్లు తొందరగా అటెన్షన్ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. మరికొందరు చీప్ ట్రిక్స్ తో అటెన్షన్ సంపాదిస్తుంటారు. కాకపోతే వీళ్లెవరూ ఆ తర్వాత గుర్తుండరు. ఎందుకంటే ఆ కాసేపూ ఆడియన్స్ వారిని చూసినా నిలబడాలంటే కంటెంటే కదా ఇంపార్టెంట్. అది లేకుంటే అంతే సంగతులుని ఇప్పటికే ఎంతోమంది ఇలా వచ్చి అలా వెళ్లినవాళ్లు ప్రూవ్ చేశారు. అయితే పరిశ్రమలో అండ, అంగబలం అన్నీ ఉన్నవాళ్లు కూడా ఇదే దారిలో వెళితే ఖచ్చితంగా చీప్ అనే పదం కూడా ఇబ్బంది పడుతుంది. అలాంటి కొత్త పదానికి ప్రయత్నించి పరిశ్రమలో నవ్వుల పాలయ్యారు దిల్ రాజు అండ్ టీమ్.

రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న దిల్ రాజు నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు. ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురు అనే టీమ్ లో ఆయనా ఉన్నాడు. అలాంటి దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ రౌడీబాయ్స్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇందుకోసం భారీ ప్యాక్ కూడా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ పాట విడుదల చేశారు.

దేవీశ్రీ ప్రసాద్ స్థాయికి ఏ మాత్రం సరితూగని ఈ పాట ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. యూత్ కూడా ఏం పాటరా బాబూ అనుకునేలా ఉంది. అలాంటి పాట అతి తక్కువ టైమ్ లోనే ఒన్ మిలియన్ యూ ట్యూబ్ వ్యూస్ దక్కించుకుందని దిల్ రాజు అండ్ కో ఊదరగొడుతోంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే.. ఇదంతా పెయిడ్ న్యూస్. వ్యూస్ కూడా అలాగే వచ్చాయి. ఇలాంటి వారి కోసం గోడమీద వార్తలు రాసి ట్రెండ్ సృష్టిస్తాం అనే ఓ సంస్థ ఉంది. వారికి డబ్బులు ఇచ్చి చేయించుకుంటోన్న ప్రచారార్భాటం ఇదంతా.

దిల్ రాజు ఈస్థాయికి దిగజారడం చూస్తోంటే ఈ రౌడీ బాయ్స్ అనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. అంటే విషయం వీక్ గా ఉన్నప్పుడే కదా ప్రమోషన్ పీక్ గా ఉండేది.

మామూలుగా దిల్ రాజు కథలను బాగా జడ్జ్ చేస్తాడు అన్న పేరుంది. అంటే ఈ కథ చివరికి ఏ కంచిలో చేరుతుందో ఊహించే ఇలా తొలి పాట నుంచే ప్రమోషన్స్ చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఇంత త్వరగా ప్రమోషన్ మొదలు పెట్టారంటే ఇక్కడ విషయం వీక్ గా ఉన్నట్టే కదా.. ఏదైనా దిల్ రాజు కూడా చీప్ ట్రిక్స్ దిగడం.. అదీ సొంత తమ్ముడి సినిమా కోసం కావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

Next Story

RELATED STORIES