OTT: ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై ఇదే రూల్..!

OTT: ఓటీటీలు అనేవి వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కు సినిమాలు మరింత అందుబాటులోకి వచ్చేశాయి. లాక్‌డౌన్ సమయంలో ఈ ఓటీటీలు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని కాపాడాయి. ఎన్నో చిన్న సినిమాలకు గుర్తింపునిచ్చాయి. అయితే లాక్‌డౌన్ ముగిసి థియేటర్లు తెరుచుకున్న తర్వాత మాత్రం ఈ ఓటీటీలు నిర్మాతలకు కేవలం నష్టాన్నే మిగిలిస్తున్నాయి. అందుకే టాలీవుడ్ నిర్మాతలంతా కలిసి ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం మూవీ టికెట్ల ధరల గురించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని ఆదేశాన్ని ఇచ్చింది. దీంతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. అందుకే మరోసారి ఓటీటీలకు డిమాండ్ కూడా పెరిగింది. అందుకే నిర్మాతలకు ఓటీటీ అనేవి పెద్ద సమస్యలాగా మారాయి.
థియేటర్లలో విడుదలయిన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తే ఇంక థియేటర్లలో సినిమాలు ఎవరు చూస్తారని నిర్మాతలు వాపోయారు. అందుకే థియేటర్లలో విడుదలయిన సినిమాలు 50 రోజులు పూర్తయ్యే వరకు ఓటీటీలోకి రాకూడదని నిర్మాతలంతా నిర్ణయించారు. ఇంతకు ముందు కూడా థియేటర్లలో విడులయిన రెండు నెలల వరకు సినిమా ఓటీటీలో విడుదల కాకూడదని నిబంధన తెచ్చినా అది ఎక్కువకాలం నిలబడలేదు. మరి ఈ కొంత నిబంధనను ఓటీటీలు ఎంతకాలం పాటిస్తాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com