Tollywood: విడుదలకు ముందే కాసుల వర్షం; S5కు బంపర్ ఆఫర్

Tollywood: విడుదలకు ముందే కాసుల వర్షం; S5కు బంపర్ ఆఫర్
హారర్ - థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా యంగ్ డైరెక్టర్లు తమ బుర్రలకు బాగానే పదును పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వచ్చినదే 'ఎస్5- నో ఎక్సిట్'. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోందట.
భరత్ కోమలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారకరత్న, ప్రిన్స్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ సినిమాపై అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డిగాదే, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ఓ రైలులో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకుంటాయి. ఆ ఒక్క బోగికే ఎందుకు అగ్నిప్రమాదం జరిగింది అన్న పాయింట్ తో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించామని డైరెక్టర్ భరత్ తెలిపారు. ఇక పోతే ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ కు ముందే భారీ లాభాలను చవిచూసిన సినిమాగా 'S5' పేరుగడించింది. సాగా ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ అమౌంట్ ఇచ్చి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం విశేషం.
ఇక మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, గరుడవేగ అంజి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. దాదాపు 200 థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com