Singer Sunitha Marriage : ఘనంగా సింగర్ సునీత రెండో వివాహం!

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఈ వివాహ వేడుక జరిగింది. అత్యంత ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది.
ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్ నుంచి హీరో నితిన్ దంపతులు హాజరయ్యారు. సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కిరణ్ అనే వ్యక్తిని సునీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ళ క్రితం నుంచే ఆయనతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు.
కిరణ్, సునీతలకి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, తాజాగా ప్రముఖ బిజినెస్ మెన్ రామ్ వీరపనానినితో సునీత రెండో వివాహం జరిగింది. అటు టాలీవుడ్ లో కొన్ని వేల పాటలతో చాలా మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది సునీత.
అటు రామ్ వీరపనానిని కూడా ఇది రెండో వివాహమే.. చాలా కాలం క్రితమే అయన తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి పిల్లలు లేరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com