సునీత ఇంట మొదలైన పెళ్లి సందడి!

టాలీవుడ్ సింగర్ సునీత నేడు(జనవరి 9) రెండో వివాహం చేసుకోబోతున్నారు. బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనితో ఇప్పటికే సునీత నిశ్చితార్థం జరగగా, తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నటి రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పసుపు రంగు చీరలో మెరిసిపోతుంది సునీత.. ఈ ఫంక్షన్ కి యాంకర్ సుమ కూడా హాజరయ్యారు.
దీనితో అభిమానులు సోషల్ మీడియా ద్వారా సునీతకి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో సునీత-రామ్ లు ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేయగా దీనికి టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గతంలో సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com