జూనియర్ బండ్ల.. 'అంతా దేవుడి దయ' అంటున్న బడా నిర్మాత..!

బండ్ల గణేష్... తెలుగు వెండితెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బడా ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమాల కన్నా ఎక్కువగా మాటలతో ఫేమస్ అయ్యాడు గణేష్.. అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటాడు గణేష్. తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరిదో కాదు బండ్ల గణేష్ పెద్ద కుమారుడు. 'ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల'.. అంటూ నెటిజన్స్‌కి పరిచయం చేశాడు గణేష్.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బండ్ల గణేష్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫోటో లాగా ఉందని, అరె అచ్చం బండ్ల గణేష్ లాగే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే 'హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా' అనే ప్రశ్నకి 'అంతా దేవుడి దయ' అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేశ్.
My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F
— BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com