Actress Jayanthi : ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

X
By - Gunnesh UV |26 July 2021 10:00 AM IST
ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 1963లో సినీరంగ ప్రవేశం చేసిన జయంతి.. సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌తో పలు హిట్ సినిమాల్లో నటించారు. జగదేకవీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం.. జస్టిస్ చౌదరి, రక్త సంబంధం, డాక్టర్ చక్రవర్తి, శాంతినివాసం వంటి చిత్రాల్లో నటించారు జయంతి. ఆమె అసలు పేరు కమల కుమారి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com