Nandyala Ravi: రచయిత నంద్యాల రవి కన్నుమూత

Nandyala Ravi: రచయిత నంద్యాల రవి కన్నుమూత
X
Nandyala Ravi : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. యంగ్ డైరెక్టర్, రచయిత నంద్యాల రవి కరోనాతో మృతి చెందారు.

Nandhyala Ravi : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. యంగ్ డైరెక్టర్, రచయిత నంద్యాల రవి కరోనాతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్మీ రావే మా ఇంటికి అనే సినిమాతో రవి దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే సినిమాలకి రచయితగా పనిచేశారు. నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా నంద్యాల రవి ఆర్థిక పరిస్థితుల తెలుసుకున్న నటుడు సప్తగిరి, నిర్మాత రాధామోహన్‌ రూపాయలు లక్ష ఆర్ధిక సహాయం చేశారు.

Tags

Next Story