ప్రముఖ నిర్మాత 'దిల్ రాజు' ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు..
ఆయన బ్యానర్ ద్వారా పరిచయమైన దర్శకులు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు మంచి చిత్రాలను

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన చిత్రాలు నిర్మించే సంస్థగా ఎదిగింది దిల్ రాజు స్థాపించిన శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్.. వి. వెంకట రమణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన మొదటి సినిమా 'దిల్‌' తోనే సక్సెస్ సాధించి అదే పేరుతో చెలామణి అవుతున్నారు. ఆయన బ్యానర్ ద్వారా పరిచయమైన దర్శకులు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. దిల్ రాజు పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ ఒకసారి చూస్తే..

సుకుమార్.. తూర్పుగోదావరి జిల్లా మట్టపాడు గ్రామం నుంచి వచ్చిన ఓ లెక్కల మాస్టారు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో 'ఆర్య' తీసి సంచలనం సృష్టించారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగులో మరో అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను. తన మొదటి సినిమా 'భద్ర'కు దిల్ రాజు నిర్మాత.


వంశీ పైడిపల్లి.. ఇతని మొదటి సినిమా 'మున్నా'కి దిల్ రాజు నిర్మాత. ఊపిరి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్‌గా ముద్ర పడిన భాస్క్రర్ మొదటి చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.

శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్‌గా అప్పటికే పని చేస్తున్నప్పటికీ 2008లో శ్రీకాంత్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌లతో తాను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం కొత్త బంగారు లోకం.. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. దీనికి నిర్మాత దిల్ రాజు.

నాగ చైతన్యతో 'జోష్' చిత్రానికి దర్శకత్వం వహించిన వాసు వర్మ. దిల్ రాజు ద్వారానే పరిచయమయ్యారు.

రవి యాదవ్.. సినిమాటోగ్రాఫర్.. 2011లో ఓ మై ఫ్రండ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

Tags

Read MoreRead Less
Next Story