Trisha with Balakrishna : బాలయ్యతో వన్స్ మోర్..!

Trisha with Balakrishna : ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్.. త్రిషకి కథను వినిపించగా అందుకు ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. లయన్ సినిమా తరవాత బాలకృష్ణతో, బాడీగార్డ్ సినిమా తర్వాత దర్శకుడు గోపిచంద్ తో సినిమా చేస్తోంది త్రిష. ఈ సినిమాని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాని చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com