Trouble In Niharika Marriage: విడాకులపై కొత్త హింట్....

మెగా ప్రిన్సెస్ నిహారిక వ్యక్తిగతం జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్న వార్తలకు ఆజ్యం పోస్తూ ఆమె సోషల్ మీడియా అప్ డేట్స్ కూడా అదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి. చైతన్యతో ఆమె వైవాహిక జీవితంలో పొరపొచ్చాలు వచ్చాయని ఈ మధ్య వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య తన ఇన్స్టా హ్యాండిల్ నిహారికతో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేశాడు. తాజాగా నిహారిక సైతం అతడిని అన్ ఫాలో అవుతూ అతడితో కలసి ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య సఖ్యతలేదు ఉన్న విషయం అర్థమవుతోంది. ఈ మధ్య సెలబ్రిటీలు అందరూ తమ విడాకులపై మొదటి హింట్ ఈ విధంగానే ఇస్తుండటంతో మెగా ప్రిన్సెస్ తన వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతోందని తెలుస్తోంది. ఏమైనా హీరోయిన్ గా రాణించాలని ఆశపడ్డ మెగా ప్రిన్సెస్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తో నిర్మాతగా నిలదొక్కుకుంది. త్వరోలనే స్వీయ నిర్మాణంలో డెడ్ పిక్సెస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా నిహారిక నటిగా రాణించాలని ఆశిద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com