సిల్వర్ స్క్రీన్ పై TV5 మూర్తి.. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు..!

సిల్వర్ స్క్రీన్ పై TV5 మూర్తి.. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు..!
తెలుగు మీడియా రంగంలో చాలా మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులు ఉన్నారు. అందులో టీవీ 5 మూర్తి ఒకరు.. తనదైన వాక్ చాతుర్యంతో తెలుగు మీడియాను ఊపేస్తున్నారయన..

తెలుగు మీడియా రంగంలో చాలా మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులు ఉన్నారు. అందులో టీవీ 5 మూర్తి ఒకరు.. తనదైన వాక్ చాతుర్యంతో తెలుగు మీడియాను ఊపేస్తున్నారయన.. అయితే ఇప్పటివరకు టీవీలో ఓ జర్నలిస్ట్ గా కనిపించిన ఆయన ఇప్పుడు.. సిల్వర్ స్క్రీన్ పైన కూడా కనిపించనున్నారు.

వన్ నేనొక్కడినే, 100%లవ్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్లే బ్యాక్ సినిమాలో మూర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సినిమాలో కూడా ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ నే పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.


టీవీ5 మూర్తి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుకుమార్ క్లాస్ మెట్ మరియు కొలీగ్ అయిన హరిప్రసాద్ జక్కా నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన తెలంగాణా హక్కులను వరంగల్ శ్రీను చేజిక్కించుకున్నారని సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story