uday kiran_shriya saran : ఉదయ్ కిరణ్, శ్రియ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ...!
uday kiran and shriya saran
uday kiran_shriya saran : తెలుగులో ఇప్పటివరకు చాలా ప్రేమకథ చిత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని క్లాసిక్‌గా నిలిచిపోయాయి.. అందులో ఒకటి 'ఆనందం'.. సినిమా వచ్చి 20 ఏళ్ళు అయింది కానీ ఇప్పటికి టీవీల్లో వస్తే వదలకుండా చూస్తుంటారు ప్రేక్షకులు.. అంతలా వారిని కట్టిపడేసింది. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఉషాకిరణ్ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ సినిమా సక్సెస్ కావడంతో శ్రీనువైట్ల ఫేం ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో హీరో ఆకాశ్‌ను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అప్పుడు ఎక్కడ చూసిన దేవిశ్రీప్రసాద్ పాటలే..అయితే ఈ సినిమాకి ముందనుకున్న హీరోహీరోయిన్ ఆకాష్, రేఖ కాదట.. ఈ సినిమా లైన్ అనుకున్నప్పుడే హీరోగా ఉదయ్‌కిరణ్‌ని అనుకున్నాడట శ్రీను వైట్ల.. ఆ తర్వాత ఉదయ్‌ని సంప్రదిస్తే ఆయనకీ కూడా కథ బాగా నచ్చిందట.. కానీ నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలకి కమిట్ అవ్వడంతో ఈ సినిమాని చేయలేకపోయారట ఉదయ్.
ఇక రేఖ కంటే ముందు హీరోయిన్‌గా శ్రియని తీసుకోవాలని అనుకున్నారట శ్రీనువైట్ల.. అయితే అప్పటికే ఆమె ఇష్టం సినిమాకి కమిట్ అవ్వడంతో చేయలేకపోయిందట. అప్పుడే కన్నడలో ఓ సినిమా చేసిన రేఖను చూసి ఫైనల్ చేశారాట.. సెకండ్ హీరోగా అనుకున్న ఆకాష్ ని లావు తగ్గమని చెప్పి ఫస్ట్ హీరోగా చేసి.. సెకండ్ హీరోగా అప్పుడే సీతారాముల కళ్యాణం చేసిన వెంకట్‌ని తీసుకున్నారట.
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేసిన తనురాయ్‌ని సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. కాగా ఉదయ్ కిరణ్, శ్రియతో మళ్ళీ సినిమా చేయలేదు శ్రీనువైట్ల.. కానీ ఉదయ్, శ్రియ మాత్ర్రం నీకు నేను నాకు నువ్వు అనే సినిమాలో కలిసి నటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com