Un Stoppable: బాలయ్య షోలో పవర్ స్టార్!

Un Stoppable: బాలయ్య షోలో పవర్ స్టార్!
అన్ స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్; వైరల్ అవుతోన్న పోస్ట్; ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా-నందమూరి ఫ్యాన్స్

Un Stoppable: బాలయ్య షోలో పవర్ స్టార్!


నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్‌ షోకు ఊహించిని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటి వరకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో చిట్ చాట్ చేసిన బాలయ్య షోలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.


ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కోసం పవన్ కల్యాన్ అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోవడంతో అక్కడ అభిమానుల కోలాహలం నెలకొంది. మరోవైపు పవన్ ను స్వయంగా బాలయ్యనే రిసీవ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


ఇక పవన్ కళ్యాణ్ తో జరిగే ఈ ఎపిసోడ్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు నందమూరి, ఇటు మెగాస్టార్‌ ఫ్యాస్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ ను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానమిస్తారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఏదేమైనా అటు మెగా-ఇటు నందమూరి అభిమానులకు ఇది సంక్రాంతికి మించిన పెద్ద పండుగ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


Tags

Read MoreRead Less
Next Story