వేద పాఠశాల కోసం ఇంటిని దానం చేసిన బాలసుబ్రహ్మణ్యం

బాలులో కనిపించే మరో కోణం దాతృత్వ గుణం. వేద పాఠశాల కోసం ఏకంగా తన సొంతింటినే దానం చేసి ఉదారతను చాటుకున్న గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. తన స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. గాన గాంధర్వుడు స్వయంగా కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి ఇంటిని అప్పగించి దానికి తన తండ్రి పేరుతో వేద పాఠశాల నిర్వహించాలని కోరారు. మరోవైపు మన దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న టైంలోనే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అండగా నిలవడానికి చొరవచూపారు. మీరు కోరిన పాటలు పేరుతో ఆన్‌లైన్లో నెటిజన్లు కోరిన పాటలు పాడి... వాటి ద్వారా వచ్చే డబ్బును ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు విరాళంగా అందజేసే కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. కరోనాపై పోరులో తనవంతు పాత్ర పోషించారు. అలాంటి బాలును కూడా కరోనా వదలలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com