Upasana : నాలుగు తరాల మహిళలతో వరలక్ష్మి వ్రతం..!

Upasana  : నాలుగు తరాల మహిళలతో వరలక్ష్మి వ్రతం..!
నిన్న(ఆగ‌స్ట్‌20)న వరలక్ష్మీ వ్రతం కావడంతో తెలుగు రాష్ట్రాలలోని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు.

నిన్న(ఆగ‌స్ట్‌20)న వరలక్ష్మీ వ్రతం కావడంతో తెలుగు రాష్ట్రాలలోని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. అందులో భాగంగానే సినీ నటుడు చిరంజీవి ఇంట్లో కూడా శ్రావణ శుక్రవారం శోభ ఉట్టిపడింది. అయితే ఈ పూజలో నాలుగు తరాలకి చెందినవారు ఒకే చోటున ఉండడం విశేషంగా ఉందని చెప్పుకొచ్చారు ఉపాసన. అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ ఫోటోలో ఉపాసన సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story