'నాట్యం'లో నటిస్తున్న హీరోయిన్ నాకు.. : ఉపాసన

X
By - prasanna |23 Jan 2021 4:49 PM IST
రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఉపాసన కొణిదెల తన స్నేహితురాలు నటిస్తున్న తొలి చిత్రం నాట్యం మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. శనివారం పోస్టర్ విడుదల చేసిన ఉపాసన మాట్లాడుతూ ఇది సంధ్య నటిస్తున్న తొలి చిత్రం. ఈ మూవీతో సినీరంగంలో అడుగుపెడుతున్న నా స్నేహితురాలిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను. ఈ టైటిల్ కూడా నాకు బాగా నచ్చింది అని ఆమె ట్వీట్ చేశారు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నటులు కమల్ కామరాజు,రోహిత్ బెహెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com