ఈ ఫ్రైడే ట్రయాంగిల్ మూవీ ఫైట్

ఈ ఫ్రైడే ట్రయాంగిల్ మూవీ ఫైట్

టాలీవుడ్ లో మంచి హిట్ పడి చాలా రోజులైంది. సినిమాలు వచ్చీ వెళ్లిపోతున్నాయి. ఫిబ్రవరిలో బాక్సాఫీసుకు సరైన విజయాలు లేవు. మార్చి సైతం నీరసంగా ప్రారంభమైంది. తొలివారంలో వచ్చిన సినిమాలన్నీ ఫట్టయ్యాయి. ఈ వారం కూడా మూడు సినిమాలు బరిలో నిలిచాయి. గోపీచంద్ 'భీమా', విశ్వక్‌సేన్ 'గామి'తో పాటు మలయాళ డబ్బింగ్ చిత్రం 'ప్రేమలు' విడుదలకు సిద్ధమయ్యాయి.

విశ్వక్‌సేన్ తొలి అడుగులు వేస్తున్నప్పుడు నటించిన సినిమా గామి. ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. మేకింగ్ లో ఆలస్యం అయినా, విజువల్స్ కేక పెట్టిస్తున్నాయి. పైగా.. కంటెంట్ కూడా కొత్తగా అనిపిస్తోంది. సీరియస్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు 'గామి' ఓ మంచి ఆప్షన్ కావొచ్చు.

గోపీచంద్ హిట్టు కొట్టి చాలాకాలం అయ్యింది. తన ఆశలన్నీ `భీమా`పైనే. మాస్‌, యాక్షన్‌, ఫాంటసీ అంశాలు మిళితమైన కథ ఇది. తమిళ దర్శకుడు 'హర్ష' రూపొందించాడు. టీజర్‌, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. మేకింగ్ క్వాలిటీ కనిపించింది. గోపీచంద్‌కు ఈ జోనర్ అచ్చొచ్చింది. కాబట్టి… హిట్టు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మలయాళ డబ్బింగ్ సినిమా 'ప్రేమలు' కూడా ఈవారం పోటీకి నిలిచింది. మామూలుగా అయితే ఈ డబ్బింగ్ సినిమాపై ఎలాంటి ఆసక్తీ ఉండేది కాదు. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. తెలుగు రైట్స్ కి డిమాండ్ ఏర్పడింది. చివరికి రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు రైట్స్ దక్కించుకొన్నాడు. యూత్‌కి, ప్రేమకథలు ఇష్టపడేవారికి ఇదో మంచి ఆప్షన్‌.

Tags

Read MoreRead Less
Next Story